ఐపీఎస్ కారును ఢీ కొట్టిన హీరోయిన్.. ఆపై నానా రచ్చ
తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. IPS అధికారి రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టమే కాకుండా.. ప్రశ్నించిన డ్రైవర్ పై స్నేహితుడితో కలిసి దాడి చేసినందుకు ఆమె పై కేసు నమోదు చేసారు.
హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టడంతో పాటు ప్రశ్నించిన డ్రైవర్ పై తన స్నేహితుడు డేవిడ్ తో కలిసి దాడి చేసిందట. ట్రాఫిక్ డీసీపీ అయిన రాహుల్ హెగ్డే అధికారిక వాహనం డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చాడు.
చేతన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సంఘటన పై ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పలు సందర్భాల్లో తన వాహనానికి వారి యొక్క వాహనం అడ్డు పెట్టడంతో పాటు అడిగితే నానా గొడవ చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నాడు. గతంలో కూడా తన కారును ఢీ కొట్టిన సందర్భాలు ఉన్నాయని ఆయన ఆరోపించాడు.
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో హుడా ఎన్ క్లేవ్ లో డీసీపీ రాహుల్ హెగ్డే ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్ లో డింపుల్ హయతి తన స్నేహితుడు డేవిడ్ తో కలిసి ఉంటుంది. రాహుల్ హెగ్డే మరియు డింపుల్ హయతి యొక్క పార్కింగ్ లు పక్కన పక్కనే.
చాలా సార్లు రాహుల్ హెగ్డే వాహనం కు డింపుల్ హయతి మరియు డేవిడ్ లు తమ బీఎండబ్ల్యూ వాహనంను అడ్డు పెట్టడం జరిగిందట. దాంతో అర్జంట్ గా వెళ్లాల్సి వచ్చిన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. సెల్లార్ లో ఉన్న పార్కింగ్ ప్లేస్ లో హెగ్డే ఇటీవల ద్వంసం చేసింది. డ్రైవర్ ఫిర్యాదుతో డింపుల్ హయతి మరియు డేవిడ్ పై వివిద సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హఠాన్మరణం.. కారణం ఇదే..!
మరో వైపు డింపుల్ హయతి ట్విట్టర్ ద్వారా డీసీపీ పై తీవ్ర విమర్శలు చేసింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తన తప్పును కప్పిపుచుకునేందుకు పరోక్షంగా డీసీపీని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఇక పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద ఆమెకు నోటీసులు ఇచ్చారు.
డింపుల్ ఆరోపణల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన డీసీపీ మాట్లాడుతూ.. డింపుల్ నేను ఒకే అపార్ట్‌మెంట్ లో ఉంటున్నాం. నా అధికారిక వాహనాన్ని ఆమె ఢీ కొట్టింది. నేను పార్క్ చేసే స్థలంలో ఆమె తన కారును అడ్డంగా పెడుతోంది. అప్పుడప్పుడు అర్జంట్ గా బయటకు వెళ్లాల్సినప్పుడు ఇబ్బంది అయ్యేది నా వాహనాన్ని ఢీ కొట్టడంతో పాటు కాలుతో తన్నింది.
ఇలా చాలా సార్లు చేసింది. నేను వ్యక్తిగతంగా కూడా రిక్వెస్ట్ చేశాను. అయినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు. అందుకే మా డ్రైవర్ చేతన్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. ఈ విషయమై డింపుల్ హయతి ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.
Also Read: CSK vs GT Playing 11: ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్, చెన్నై ఢీ.. తుది జట్లు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook